కంటెంట్‌కు వెళ్లు

ప్రైవసీ పాలసీ

ప్రైవసీ పాలసీ

మీ ప్రైవసీని గౌరవిస్తున్నాం

 మీ ప్రైవసీని కాపాడడం, గౌరవించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. మేము మీ దగ్గర సేకరించే లేదా మీరు మాకు అందజేసే ఎలాంటి వ్యక్తిగత సమాచారమైనా మా వెబ్‌సైట్‌లో అలాగే Watchtower Bible and Tract Society of New York, Inc. (“Watchtower”) అందజేసిన ఇతర ఆప్‌లలో దేని ఆధారంగా ప్రోసెస్‌ చేయబడుతుందో ఈ పాలసీ చెప్తుంది. మీరు మా వెబ్‌సైట్‌ని సందర్శించినప్పుడు మేము కొంత ప్రాథమిక సమాచారాన్ని దగ్గర పెట్టుకుంటాం; ఆ సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం, దానితో మేము ఏం చేస్తామో మీకు చెప్పడం ప్రాముఖ్యమని గుర్తిస్తాం. వ్యక్తిగత సమాచారంగా ఎంచబడే వివరాలను మాకు అందజేయాలా వద్దా అనేది మీరు ఎంపిక చేసుకోవచ్చు. ఈ పాలసీలో “వ్యక్తిగత సమాచారం” అనే మాట మీ పేరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌, పోస్టల్‌ అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌, లేదా మిమ్మల్ని గుర్తించడానికి ఉపయోగపడగల ఏ సమాచారాన్నైనా సూచిస్తుంది. ఇక్కడ, “వెబ్‌సైట్‌” అనే పదం ఈ వెబ్‌సైట్‌ని, దీనికి సంబంధించిన ఇతర సైట్‌లను, అంటే apps.pr2711.com, ba.pr2711.com, stream.pr2711.com, wol.pr2711.com లాంటి వాటిని సూచిస్తుంది.

సమాచార నియంత్రణ వివరాలు

 ఈ వెబ్‌సైట్‌ అలాగే దానికి సంబంధించిన ఇతర ఆప్‌లు Watchtowerకి చెందినవి. ఇది యెహోవాసాక్షుల కార్యకలాపాలకు, వాళ్ల బైబిలు విద్యా పనికి మద్దతిచ్చే లాభాపేక్షలేని ఒక న్యూయార్క్‌ కార్పొరేషన్‌. మీకై మీరు ఒక అకౌంటు ఓపెన్‌ చేయాలని, విరాళం ఇవ్వాలని, ఉచిత బైబిలు స్టడీ కోసం రిక్వెస్టు చేయాలని, లేదా వ్యక్తిగత సమాచారం ఇవ్వాల్సి వచ్చే ఏ పనైనా చేయాలని నిర్ణయించుకుంటే, మీరు ఈ పాలసీకి సమ్మతి తెలుపుతున్నారు; అంతేకాదు మీ సమాచారాన్ని అమెరికాలో ఉన్న సర్వర్లలో స్టోర్‌ చేయడానికీ, మీ రిక్వెస్టును ప్రోసెస్‌ చేయడం కోసం అవసరమయ్యే విధంగా Watchtower, అలాగే ఆయా దేశాల్లో యెహోవాసాక్షులకు మద్దతిచ్చే ఇతర సంస్థలు మీ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి, ప్రోసెస్‌ చేయడానికి, ట్రాన్స్‌ఫర్‌ చేయడానికి, స్టోర్‌ చేయడానికి మీరు సమ్మతి తెలుపుతున్నారు. ఈ మత సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆయా స్థానిక యూనిట్ల ద్వారా పనిచేస్తుంది. సమాచార భద్రత కోసం, వాటిలో స్థానిక సంఘాలు, బ్రాంచి కార్యాలయాలు, యెహోవాసాక్షులకు మద్దతిచ్చే అలాంటి ఇతర సంస్థలు ఉండవచ్చు.

మీ సమాచారాన్ని ఎవరు నియంత్రిస్తారు అనేది, మీరు వెబ్‌సైట్‌ ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు అనేదాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఒక దేశంలోని చట్టపరమైన యూనిట్‌కి విరాళం ఇస్తే, విరాళం ఇస్తున్న సమయంలో మీకు చూపించిన ఆ చట్టపరమైన యూనిట్‌కి మీ పేరు, కాంటాక్ట్‌ సమాచారం అందజేయబడతాయి. ఇంకో ఉదాహరణ, ఒకవేళ మీరు బైబిల్‌ స్టడీ కోసం రిక్వెస్టు చేస్తే, మీరు అడిగింది చేయడం కోసం మీ పేరు, కాంటాక్ట్‌ సమాచారం యెహోవాసాక్షుల స్థానిక బ్రాంచి కార్యాలయానికి, సంఘానికి అందజేయబడతాయి.

మీ సహాయం కోసం: ఒకవేళ మీరు ఉంటున్న దేశానికి ఈ విషయంలో వర్తించే సమాచార భద్రత చట్టాలు ఏవైనా ఉంటే, మీరు ఉంటున్న దేశానికి సంబంధించిన కాంటాక్ట్‌ సమాచారాన్ని సమాచార భద్రత కాంటాక్ట్‌ల పేజీలో చూడవచ్చు

సమాచారాన్ని భద్రంగా, రహస్యంగా ఉంచడం

 మీ వ్యక్తిగత సమాచారాన్ని భద్రంగా, రహస్యంగా ఉంచడం మాకు చాలా ప్రాముఖ్యం. మీ వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక ఉపయోగం నుండి, తప్పుగా ఉపయోగించడం లేదా వెల్లడిచేయడం నుండి, అనధికారికంగా మార్పులు చేయడం, చట్టవిరుద్ధంగా నాశనం చేయడం, లేదా ప్రమాదవశాత్తు కోల్పోవడం నుండి కాపాడడం కోసం మేము సమాచారాన్ని స్టోర్‌ చేయడానికి, భద్రపర్చడానికి అధునాతన పద్ధతులు ఉపయోగిస్తాం. వ్యక్తిగత సమాచార ప్రోసెసర్‌లన్నీ, అలాగే మీ వ్యక్తిగత సమాచారాన్ని ప్రోసెస్‌ చేయడానికి మేము ఉపయోగించే థర్డ్‌ పార్టీలన్నీ సమాచారాన్ని రహస్యంగా ఉంచే విషయంలో మీ హక్కును గౌరవిస్తాయి, దాన్ని బాధ్యతగా దృష్టిస్తాయి. మీ వ్యక్తిగత సమాచారం ఎందుకోసం సేకరించబడిందో ఆ ఉద్దేశాల కోసం గానీ, సంబంధిత చట్టపర నివేదికలు సమర్పించడం లేదా అవసరమైన దస్తావేజులు దగ్గరపెట్టుకోవడం అనే కారణాల కోసం గానీ ఎంతకాలం మా దగ్గర ఉంచుకోవడం మంచిదో కేవలం అంతకాలం వరకే దాన్ని ఉంచుతాం.

ట్రాన్సిట్‌ సమయంలో, Transport Layer Security (TLS) లాంటి ఎన్‌క్రిప్షన్‌ ప్రోటోకాల్స్‌ ఉపయోగించి మేము మీ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతాం. భౌతిక, ఎలక్ట్రానిక్‌, అలాగే నియమబద్ధమైన భద్రతా చర్యలు ఉపయోగించే వసతుల్లో ఉన్న, పరిమిత యాక్సెస్‌ ప్రోటోకాల్స్‌ని మాత్రమే ఉన్న కంప్యూటర్‌ సిస్టమ్‌లను మేము ఉపయోగిస్తాం. ఎలాంటి అనధికారిక ఉపయోగం జరగకుండా మేము ఖచ్చితమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తాం.

మైనర్‌లు

 ఈ వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్న దేశంలో మీరు మైనర్‌ అయితే, మీ తల్లిదండ్రుల లేదా గార్డియన్‌ పర్యవేక్షణ కింద మాత్రమే మీ వ్యక్తిగత సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో సబ్‌మిట్‌ చేయవచ్చు. మీరు తల్లిదండ్రులు లేదా గార్డియన్‌ అయ్యుండి, ఒక మైనర్‌ ఈ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత సమాచారాన్ని సబ్‌మిట్‌ చేయడానికి సమ్మతి తెలిపితే, ఆ మైనర్‌ దీన్ని ఉపయోగించే విషయంలో మీరు ఈ పాలసీని అంగీకరిస్తున్నారు.

థర్డ్‌-పార్టీలు

 కొన్నిసార్లు, మా తరఫున కొన్ని సేవలు చేయడానికి (ఉదాహరణకు, ఆన్‌లైన్‌ ఫారమ్‌లు నింపడానికి) మేము ఉంచుకున్న కొన్ని థర్డ్‌-పార్టీల వెబ్‌సైట్‌కు తీసుకెళ్లే లింక్‌లు ఈ వెబ్‌సైట్‌లో లేదా దానికి సంబంధించిన ఇతర ఆప్‌లలో ఉంటాయి. మీరు అలాంటి థర్డ్‌-పార్టీ వెబ్‌సైట్‌లో ఉంటే ఆ సంగతి మీకు తెలిసిపోతుంది, ఎందుకంటే దాని రూపురేఖలు వేరుగా ఉంటాయి; అలాగే మీ బ్రౌజర్‌లోని అడ్రస్‌ బార్‌ మారిపోతుంది. అంతేకాదు, ఈ వెబ్‌సైట్‌ ద్వారా మీరు సమాచారం కోసం చేసిన రిక్వెస్టును బట్టి మీకు థర్డ్‌-పార్టీ నుండి ఈ-మెయిల్స్‌ లేదా టెక్స్‌ట్‌ మెసేజ్‌లు రావచ్చు. అలాగే మీరు రిక్వెస్టు చేసిన కార్యకలాపాల తాలూకు నోటిఫికేషన్‌ కూడా రావచ్చు. థర్డ్‌-పార్టీలను ఎంచుకునేటప్పుడు, అలాగే ఆ తర్వాత కూడా క్రమంగా వాళ్ల ప్రైవసీ, సమాచార భద్రత పాలసీలు తనిఖీ చేయబడతాయి, మా పాలసీల కోసం మేము ఉపయోగించే ప్రమాణాలకు అవి సరితూగుతున్నాయో లేదో తనిఖీ చేయబడతాయి. అయితే, ఈ థర్డ్‌ పార్టీలు అందించే యాప్‌ల, సర్వీసుల ప్రోగ్రామింగ్‌, వినియోగంపై షరతులు, ప్రైవసీ పాలసీలు, సాధారణ షరతులు మేము నియంత్రించలేము. కాబట్టి, ఈ వెబ్‌సైట్‌లో మీరు ఆ యాప్‌లను, సర్వీసులను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు ఆ థర్డ్‌-పార్టీవాళ్ల ప్రస్తుత సేవా షరతులకు, సాధారణ షరతులకు కట్టుబడి ఉంటారు. ఒక థర్డ్‌-పార్టీ గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి వాళ్ల వెబ్‌సైట్‌లో పేర్కొనబడిన పాలసీని చూడండి.

ఈ వెబ్‌సైట్‌లో మీరు ఉపయోగించుకునే గూగుల్‌ మ్యాప్స్‌ సేవలు ప్రస్తుతం ఉన్న గూగుల్‌ ప్రైవసీ పాలసీకి లోబడి ఉంటాయి. గూగుల్‌ ఒక థర్డ్‌-పార్టీ వెండర్‌. దాని యాప్స్‌, ప్రోగ్రామింగ్‌, వినియోగంపై షరతులు మేము నియంత్రించలేము. అందువల్ల, ఈ వెబ్‌సైట్‌లో మీరు గూగుల్‌ మ్యాప్స్‌ సేవలు ఉపయోగిస్తున్నప్పుడు ప్రస్తుత గూగుల్‌ మ్యాప్స్‌/గూగుల్‌ ఎర్త్‌ ఎడిషనల్‌ టర్మ్‌స్‌ ఆఫ్‌ సర్వీసెస్‌కి కట్టుబడి ఉంటారు. అప్‌డేట్స్‌ మాకు తెలియజేయబడవు కాబట్టి గూగుల్‌ మ్యాప్స్‌ సేవలను ఉపయోగించుకునే ముందు షరతులను దయచేసి సమీక్షించండి. మీరు ఆ షరతులకు అంగీకరించకపోతే గూగుల్‌ మ్యాప్స్‌ సేవలను ఉపయోగించకండి.

ఈ పాలసీలో మార్పుల గురించి తెలపడం

 ఈ వెబ్‌సైట్‌ అలాగే దానికి సంబంధించిన ఇతర ఆప్‌ల పనితీరును, మేము ఇప్పటికే అందిస్తున్న సేవల్ని మెరుగుపర్చడానికీ వాటికి కొత్తకొత్త అంశాలు జతచేయడానికీ మేము ఎప్పుడూ కృషిచేస్తుంటాం. అలాంటి మార్పుల వల్ల, చట్టంలో అలాగే టెక్నాలజీలో వచ్చే మార్పుల వల్ల మేము సమాచారాన్ని ఉపయోగించే విషయంలో అప్పుడప్పుడు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. మా పాలసీలో మార్పులు చేయాల్సి వచ్చినప్పుడు, ఈ పేజీలో వాటి గురించి చెప్తాం. అప్పుడు మేము ఎలాంటి సమాచారం సేకరిస్తామో, దాన్ని ఎలా ఉపయోగిస్తామో మీకు ఎప్పటికప్పుడు తెలుస్తుంది.

యాక్టివ్‌ స్క్రిప్టింగ్‌ లేదా జావాస్క్రిప్ట్‌

 మా వెబ్‌సైట్‌ అలాగే దానికి సంబంధించిన ఇతర ఆప్‌ల పనితీరును మెరుగుపర్చడానికి స్క్రిప్టింగ్‌ని ఉపయోగిస్తాం. స్క్రిప్టింగ్‌ టెక్నాలజీ ద్వారా మేము మీరు కోరిన సమాచారాన్ని త్వరగా అందించగలుగుతాం. మీ కంప్యూటర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేయడానికి గానీ, అనుమతిలేని సమాచారాన్ని మీ నుండి సేకరించడానికి గానీ ఈ వెబ్‌సైట్‌ లేదా దానికి సంబంధించిన ఇతర ఆప్‌లు స్క్రిప్టింగ్‌ని ఎప్పుడూ ఉపయోగించవు.

వెబ్‌సైట్‌లోని కొన్ని భాగాలు సరిగ్గా పనిచేయాలంటే, మా వెబ్‌సైట్‌ కోసం యాక్టివ్‌ స్క్రిప్టింగ్‌ లేదా జావాస్క్రిప్ట్‌ ఎనేబుల్‌ చేసి ఉండాలి. చాలా బ్రౌజర్లు, ఆయా వెబ్‌సైట్లలో ఈ ఫీచర్‌ని ఎనేబుల్‌ చేసే లేదా డిసేబుల్‌ చేసే వీలు కల్పిస్తాయి. ఆయా వెబ్‌సైట్లలో స్క్రిప్టింగ్‌ని ఎలా ఎనేబుల్‌ చేయాలో తెలుసుకోవడానికి బ్రౌజర్‌లో హెల్ప్‌ కింద ఉన్న సమాచారాన్ని చూడండి.