దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయి?
బైబిలు ఇచ్చే జవాబు
దేవునికి ఒకే ఒక పేరు ఉంది. దాన్ని హీబ్రూ భాషలో יהוה అని రాస్తారు, ఇంగ్లీషు భాషలో “Jehovah” అని రాస్తారు. a దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇలా చెప్పాడు, “యెహోవాను నేనే; ఇదే నా నామము.” (యెషయా 42:8) ప్రాచీన బైబిలు రాతప్రతుల్లో ఈ పేరు దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. దేవుని గురించి ప్రస్తావిస్తూ ఉపయోగించే వేరే ఏ మాట కన్నా, వేరే ఎవ్వరి పేరు కన్నా యెహోవా అనే పేరే ఎక్కువసార్లు కనిపిస్తుంది. b
దేవునికి వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా?
బైబిలు దేవున్ని ఒకే పేరుతో పిలుస్తున్నప్పటికీ, ఆయనకు వేర్వేరు బిరుదులను, వర్ణనలను ఉపయోగిస్తుంది. వాటిలో కొన్ని కిందున్న లిస్టులో ఉన్నాయి. అయితే అవి ఆయన స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని ఎలా తెలియజేస్తున్నాయో గమనించండి.
బిరుదు |
వచనం |
అర్థం |
---|---|---|
అల్లాహ్ |
(ఏమీలేదు) |
ఇది అరబిక్ భాష నుండి వచ్చింది. అల్లాహ్ అనేది ఒక పేరు కాదుగానీ “దేవుడు” అనే అర్థమిచ్చే ఒక బిరుదు. అరబిక్, ఇతర భాషల్లోని బైబిలు అనువాదాల్లో “దేవుడు” అనే మాటకు సమానార్థకంగా “అల్లాహ్” అనే మాటను వాడారు. |
ఆల్ఫా, ఓమెగ |
“మొదటివాడను కడపటివాడను,” “ఆదియు అంతము” అనే మాటలకు అర్థమేమిటంటే, యెహోవా కన్నా ముందు సర్వశక్తిగల ఏ దేవుడూ లేడు, ఆయన తర్వాత కూడా ఏ దేవుడూ ఉండడు అని. (యెషయా 43:10) గ్రీకు అక్షరాల్లో మొదటి అక్షరం ఆల్ఫా, చివరి అక్షరం ఓమెగ. |
|
కాపరి |
తన ఆరాధకుల పట్ల శ్రద్ధ తీసుకునేవాడు. |
|
కుమ్మరి |
కుమ్మరికి మట్టిపై అధికారం ఉన్నట్లు, ఆయనకు మనుషులపై, జనాంగాలపై అధికారం ఉంది.—రోమీయులు 9:20, 21. |
|
కేడెము |
భద్రతనిచ్చే ఆశ్రయం, రక్షణకు మూలము. |
|
తండ్రి |
జీవాన్ని ఇచ్చినవాడు. |
|
దేవుడు |
ఆరాధన పొందేవాడు. బలవంతుడు. హీబ్రూ పదమైన ఎలోహిమ్ బహువచనం. యెహోవా ఘనత, మహిమ, గొప్పతనం అని దానర్థం. |
|
నేను ఉన్నవాడను అను వాడను |
నిర్గమకాండము 3:14, కింగ్ జేమ్స్ వర్షన్ |
తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఎలా కావాలనుకుంటే అలా అవుతాడు. ఈ వాక్యాన్ని, “నాకు ఎలా నచ్చితే అలా అవుతాను,” “నేను ఎలా కావాలనుకుంటే అలా అవుతాను” అని కూడా అనువదించవచ్చు. (జె.బి. రోథర్హామ్ రాసిన ద ఎంఫసైజ్డ్ బైబిల్, న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్) తర్వాతి వచనంలో ఇవ్వబడిన యెహోవా పేరును వివరించడానికి ఈ వివరణ సహాయం చేస్తుంది.—నిర్గమకాండము 3:15. |
పరిశుద్ధ దేవుడు |
వేరే ఎవ్వరికన్నా అత్యంత పరిశుద్ధుడు (నైతికంగా పరిశుభ్రంగా, పవిత్రంగా ఉండేవాడు). |
|
పుట్టించినవాడు |
అన్నిటినీ తయారుచేసిన వ్యక్తి.—ప్రకటన 4:11. |
|
ప్రభువు |
యజమాని లేదా ప్రభువు; హీబ్రూలో అదోన్, అదోనిమ్. |
|
ప్రార్థన ఆలకించువాడు |
విశ్వాసంతో చేసే ప్రతీ ప్రార్థనను స్వయంగా వినేవాడు. |
|
మహాగొప్ప ఉపదేశకుడు |
యెషయా 30:20-21, NW |
మనకు ఉపయోగపడే విషయాలను బోధిస్తాడు, నిర్దేశాన్ని ఇస్తాడు.—యెషయా 48:17, 18. |
మహాదేవుడు |
అత్యున్నతమైన దేవుడు. కొందరు ఆరాధించే ‘వ్యర్థమైన దేవుళ్ల’ లాంటివాడు కాదు.—యెషయా 2:8, NW. |
|
మహావృద్ధుడు |
ఆది లేదు అని అర్థం. ఎవ్వరూ, ఏదీ ఉనికిలో లేనప్పుడు నుండి ఉన్నవాడు.—కీర్తన 90:2. |
|
మహోన్నతుడు |
అందరికన్నా ఉన్నతుడు, అత్యున్నతమైన స్థానంలో ఉండేవాడు. |
|
యుగయుగాలకు రాజా |
ఆయన పరిపాలనకు ఆది, అంతము లేదు. |
|
రక్షకుడు |
ప్రమాదం లేదా నాశనం నుండి తప్పించేవాడు. |
|
రోషముగలవాడు |
నిర్గమకాండము 34:14, కింగ్ జేమ్స్ వర్షన్ |
వేరేవాళ్లను ఆరాధిస్తే సహించనివాడు. “శత్రువుల్ని సహించని వాడు,” “పూర్తి భక్తిని కోరేవాడిగా పేరు పొందినవాడు” అని కూడా అనువదించబడింది.—గాడ్స్ వర్డ్ బైబిల్; న్యూ వరల్డ్ ట్రాన్స్లేష.న్ |
విమోచకుడు, విడుదల చేసేవాడు |
యెషయా 41:14; కింగ్ జేమ్స్ వర్షన్ |
యేసు అర్పించిన విమోచన క్రయధన బలి ఆధారంగా మానవజాతిని పాప మరణాల నుండి విడుదల చేసేవాడు లేదా వాటినుండి తిరిగి కొనేవాడు.—యోహాను 3:16. |
సంతోషంగల దేవుడు |
ఆయన ఆనందంగా, సంతోషంగా ఉంటాడు.—కీర్తన 104:31. |
|
సర్వశక్తిగల దేవుడు |
అమితమైన శక్తిగలవాడని అర్థం. “సర్వశక్తిగల దేవుడు” అనే అర్థమిచ్చే ఎల్ షద్దయి అనే హీబ్రూ మాట బైబిల్లో ఏడుసార్లు కనిపిస్తుంది. |
|
సర్వోన్నత ప్రభువు |
అత్యున్నత అధికారం గలవాడు. హీబ్రూలో అదోనయి. |
|
సృష్టికర్త |
అన్నిటినీ ఉనికిలోకి తెచ్చినవాడు. |
|
సైన్యాలకు అధిపతి |
కోటానుకోట్ల దూతల సైన్యానికి అధిపతి. |
హీబ్రూ లేఖనాల్లో కొన్ని ప్రాంతాల పేర్లు
బైబిల్లోని కొన్ని ప్రాంతాల పేర్లకు దేవుని పేరు జత చేసి ఉంది. అంతమాత్రాన అవి యెహోవాకు ఉన్న వేరే పేర్లు కాదు.
ప్రాంతం పేరు |
వచనం |
అర్థం |
---|---|---|
యెహోవా నిస్సీ |
“యెహోవాయే నా ధ్వజ స్తంభం.” యెహోవా ప్రజలు రక్షణ, సహాయం కోసం ఆయన మీద ఆధారపడవచ్చు.—నిర్గమకాండము 17:13-16. |
|
యెహోవా యీరే |
‘యెహోవా చూసుకుంటాడు’ అని అర్థం. |
|
యెహోవా షాలోము |
“యెహోవాయే శాంతి.” |
|
యెహోవా షమ్మా |
యెహెజ్కేలు 48:35, అధస్సూచి, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ |
“యెహోవా అక్కడ ఉన్నాడు.” |
దేవుని పేరు తెలుసుకుని, దాన్ని ఉపయోగించడానికి కారణాలు
దేవుడు తన పేరైన యెహోవాను ప్రాముఖ్యమైన దానిగా ఎంచుతున్నాడు. అందుకే ఆయన దాన్ని బైబిల్లో కొన్ని వేలసార్లు ఉండేలా చూశాడు.—మలాకీ 1:11.
దేవుని పేరుకున్న ప్రాముఖ్యతను ఆయన కుమారుడైన యేసు నొక్కి చెప్పాడు. ఉదాహరణకు ఆయన ఒక సందర్భంలో ఇలా ప్రార్థన చేశాడు, “నీ పేరు పవిత్రపర్చబడాలి.”—మత్తయి 6:9; యోహాను 17:6.
దేవుని పేరు తెలుసుకుని, దాన్ని ఉపయోగించేవాళ్లు ఆయనతో స్నేహం చేయడం మొదలుపెట్టినట్లే. (కీర్తన 9:10; మలాకీ 3:16) అలా స్నేహం చేసేవాళ్లు దేవుడు చేసిన ఈ వాగ్దానం నుండి ప్రయోజనం పొందుతారు: “అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను.”—కీర్తన 91:14.
బైబిలు ఇలా చెప్తోంది, ‘పరలోకంలో గానీ, భూమ్మీద గానీ ప్రజలు దేవుళ్లని అనుకునేవి చాలానే ఉన్నాయి. అలాగే “దేవుళ్లు,” “ప్రభువులు” కూడా చాలామందే ఉన్నారు.’ (1 కొరింథీయులు 8:5, 6) కానీ ఏకైక సత్య దేవుని పేరు మాత్రం యెహోవా అని బైబిలు స్పష్టంగా చెప్తోంది.—కీర్తన 83:18.
a కొంతమంది హీబ్రూ విద్వాంసులు దేవుని పేరును “యావే” అని రాయాలని అభిప్రాయపడతారు.
b దేవుని పేరును కాస్త చిన్నగా చేసి, “Jah,” లేదా “యాహ్” అని కూడా పలుకుతారు. “Praise Jah” అనే అర్థమొచ్చే హల్లెలూయా, అల్లెలూయా అనే పదాలతో కలిపి “Jah” అనే పదం బైబిల్లో దాదాపు 50 సార్లు కనిపిస్తుంది.—ప్రకటన 19:1; అమెరికన్ స్టాండర్డ్ వర్షన్; కింగ్ జేమ్స్ వర్షన్.