యెహోవాసాక్షులను సాదరంగా ఆహ్వానించిన అట్లాంటా
“దేవుని రాజ్యం కోసం సేవచేయాలనే కోరిక, ఇష్టం ఉన్న మీ సంస్థవాళ్లను నేను చాలా గౌరవిస్తున్నాను. మీతోటి సాక్షులకు, సమాజానికి మీరు స్వచ్ఛందంగా చేస్తున్న సహాయాన్ని విలువైనదిగా ఎంచుతూ చాలా మెచ్చుకుంటున్నాను.”
ఈ మాటలు, అమెరికాలోని జార్జియాలో ఉన్న అట్లాంటా నగర మేయర్ అయిన కాసిమ్ రీడ్ యెహోవాసాక్షులకు రాసిన ఉత్తరంలోనివి. అట్లాంటాలో జరుగుతున్న మూడు పెద్ద సమావేశాలకు యెహోవాసాక్షులను సాదరంగా ఆహ్వానిస్తూ ఆయన ఆ ఉత్తరం రాశాడు.
అదేవిధంగా, అట్లాంటా నగర కౌన్నిల్ కూడా వేరే దేశాలనుండి సమావేశానికి వస్తున్నవాళ్లును ఆహ్వానిస్తూ ఒక అధికారిక ప్రకటన చేసింది. ఆ ప్రకటనలో ఇలా ఉంది, “ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 లక్షలమంది యెహోవాసాక్షులు ఉన్నారు, . . . వాళ్లలో వందలాది జాతులకు, భాషలకు చెందినవాళ్లు ఉన్నారు. అయినా . . . మీ అందరికి ఒకేలాంటి లక్ష్యాలు ఉన్నాయి . . . బైబిలు చెప్తున్న దేవుణ్ణి అంటే సమస్తాన్ని సృష్టించిన యెహోవాను మీరు ఘనపర్చాలనుకుంటున్నారు.”
2014 జూలై, ఆగస్టు నెలల్లో మూడు సమావేశాలు జరిగాయి. వాటిలో రెండు సమావేశాలు ఇంగ్లీషులో జరిగాయి ఇంకొకటి స్పానిష్‌లో జరిగింది. వాటికి హాజరవ్వడానికి దాదాపు 28 దేశాల నుండి సాక్షులు వచ్చారు. ఇంగ్లీషులో ఇస్తున్న ప్రసంగాలను అక్కడికక్కడే రష్యన్, జపనీస్ భాషల్లోకి అనువదించారు. దానివల్ల ఆ భాషలు మాట్లాడేవాళ్లు ప్రయోజనం పొందారు. మూడు సమావేశాలకు కలిపి 95,689 మంది హాజరయ్యారు.
యెహోవాసాక్షులు 2014లో, అమెరికాలోని 16 వేర్వేరు ప్రాంతాలతోసహా తొమ్మిది దేశాల్లో 24 పెద్ద అంతర్జాతీయ సమావేశాలను జరుపుకున్నారు.