పత్రిక ముఖ్యాంశం | అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్!!!
అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్!!!
ఒక 13 ఏళ్ల అమ్మాయికి కుక్క పిల్లను గిఫ్ట్‌గా ఇచ్చినప్పుడు ఇలానే అనుకుంది. స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ల నాన్న గిఫ్ట్‌గా ఇచ్చిన కంప్యూటర్ తన జీవితాన్ని మార్చేసిందని ఒక పెద్ద వ్యాపారవేత్త చెప్పింది. కొత్తగా పెళ్లైన ఒక భర్తకి వాళ్ల మొదటి పెళ్లి రోజున అతని భార్య ఆమె చేత్తో చేసిన కార్డ్ ఇచ్చింది. అది తనకున్న గిఫ్ట్స్ అన్నిటిలో బెస్ట్ గిఫ్ట్ అని అతను అన్నాడు.
ప్రతి సంవత్సరం చాలామంది ఏదో ఒక ప్రత్యేకమైన సందర్భం కోసం వాళ్ల ఫ్రెండ్స్‌కో, చుట్టాలకో “మంచి” గిఫ్ట్ ఇవ్వాలని వాటిని వెదకడానికి వాళ్ల సమయాన్ని, శక్తిని వెచ్చిస్తారు. చాలామంది మనం ఆర్టికల్ మొదట్లో చూసిన మాటల్ని వినాలని కోరుకుంటూ ఉంటారు. మరి మీరు? అందరూ మెచ్చుకునే గిఫ్ట్ ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి మీరు ఇష్టపడతారా?
అది ఊహించుకోవడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే పొందిన వాళ్లకు ఆ గిఫ్ట్ ఆనందాన్ని కలిగిస్తుంది, ఇచ్చినవాళ్లకు కూడా ఆనందాన్ని తెస్తుంది. అందుకే, బైబిలు ఇలా చెప్తుంది: “తీసుకోవడంలో కన్నా ఇవ్వడంలోనే ఎక్కువ సంతోషం ఉంది.” (అపొస్తలుల కార్యాలు 20:35) నిజమే, గిఫ్ట్ తీసుకున్నవాళ్లు దానికి ఎక్కువ విలువ ఇవ్వడం చూసినప్పుడు ఇచ్చిన వాళ్లు చాలా సంతోషిస్తారు.
మరి గిఫ్ట్ ఇస్తున్నప్పుడు మీకూ, దాన్ని తీసుకున్న వాళ్లకూ నిజమైన సంతోషం కలిగేలా మీరు ఏమి చేయవచ్చు? “బెస్ట్” గిఫ్ట్ ఇవ్వలేకపోయినా, దాన్ని నిజంగా మెచ్చుకునేలా చేయాలంటే మీరు ఏమి చేయవచ్చు?