ఇందులో ఉన్న పాఠాల్ని బాగా అర్థం చేసుకోవడానికి . . .
వేరేవాళ్ల సహాయం తీసుకోండి: అందుకోసం, మీకు ఈ చిన్నపుస్తకం ఇచ్చిన వ్యక్తిని అడగండి లేదా jw.org అనే మా వెబ్సైట్లో మీ వివరాలు నింపండి.
పాఠం మొదటి భాగం
ప్రతీ పేరాను, దానికి సంబంధించిన ప్రశ్నను (1), బైబిలు వచనాల్ని (2) చదవండి. కొన్ని వచనాల దగ్గర “చదవండి” అని రాసి ఉంటుంది, ఆ వచనాల్ని మీకు నేర్పిస్తున్న వ్యక్తితో కలిసి చదవండి.
పాఠం మధ్య భాగం
ఎక్కువ తెలుసుకోండి కింద ఉన్న పరిచయ మాటలు (3), తర్వాత ఏం చర్చిస్తామో చెప్తాయి. ఉపశీర్షికలు లేదా సబ్ హెడింగ్‌లు (4) పాఠంలోని ముఖ్యమైన విషయాల్ని చెప్తాయి. బైబిలు వచనాల్ని చదవండి, ప్రశ్నలకు జవాబు చెప్పండి, వీడియోల్ని (5) చూడండి.
చిత్రాలు, చిత్రాల కింద ఉన్న మాటలు (6) గమనించండి. కొంతమంది ఇలా అంటారు (7) కింద ఇచ్చిన ప్రశ్నకు మీరు ఎలా జవాబు చెప్తారో ఆలోచించండి.
పాఠం చివరి భాగం
ఒక్కమాటలో, అలాగే మీరేం నేర్చుకున్నారు (8) అనేవి పాఠంలో నేర్చుకున్న వాటిని గుర్తుచేస్తాయి. పాఠం పూర్తయిన తేదీ రాసుకోండి. ఇలా చేసి చూడండి (9) కింద మీరు చేయాల్సిన పనులు ఉంటాయి. ఇవి కూడా చూడండి (10) కింద ఉన్న ఆర్టికల్స్‌ని, వీడియోల్ని మీరు కావాలనుకుంటే చూడవచ్చు.
బైబిలు వచనాలు ఎలా తెరవాలి?
బైబిలు వచనాల్ని తెరవడానికి బైబిలు పుస్తకం పేరు (ఎ), దానితోపాటు అధ్యాయం (బి), తర్వాత వచనం (సి) ఇస్తారు. ఉదాహరణకు, యోహాను 17:3 అన్నప్పుడు యోహాను అనే పుస్తకంలో, 17వ అధ్యాయం, 3వ వచనం తెరవాలని అర్థం.