కీర్తనలు 65:1-13
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు శ్రావ్యగీతం. గీతం.
65 దేవా, సీయోనులో+ నీ కోసం స్తుతి వేచివుంది;మేము మా మొక్కుబళ్లను నీకు చెల్లిస్తాం.+
2 ప్రార్థనలు వినే దేవా, అన్నిరకాల ప్రజలు నీ దగ్గరికి వస్తారు.+
3 నా తప్పులు నన్ను ముంచెత్తుతున్నాయి,+అయితే నువ్వు మా అపరాధాల్ని క్షమిస్తావు.*+
4 నీ ప్రాంగణాల్లో నివసించడం కోసం,నువ్వు ఎంచుకుని, నీ దగ్గరికి తెచ్చుకునే వ్యక్తి సంతోషంగా ఉంటాడు.+
నీ మందిరంలోని, నీ పవిత్ర ఆలయంలోని*+ మంచివాటితోమేము తృప్తి పొందుతాం.+
5 మా రక్షకుడివైన దేవా,సంభ్రమాశ్చర్యాలు పుట్టించే నీతికార్యాలతో+ నువ్వు మాకు జవాబిస్తావు;భూమి నలుమూలల్లో, సముద్రం అవతల సుదూరంలోఉన్న ప్రజల నమ్మకానివి నువ్వే.+
6 నువ్వు* నీ శక్తితో పర్వతాల్ని సుస్థిరం చేశావు;నువ్వు* బలాన్ని వస్త్రంలా ధరించావు.+
7 నువ్వు* సముద్రాల హోరును,వాటి అలల ఘోషను, దేశాల అలజడిని+ అణచివేస్తావు.+
8 సంభ్రమాశ్చర్యాలు పుట్టించే నీ కార్యాల్ని చూసి మారుమూల ప్రాంతాల ప్రజలు భయపడతారు;+సూర్యోదయ దిక్కు నుండి సూర్యాస్తమయ దిక్కు వరకు ఉన్న ప్రజల్ని నువ్వు సంతోషంతో కేకలు వేసేలా చేస్తావు.
9 నువ్వు భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటూ,అది విస్తారంగా పండేలా* చేస్తూ దాన్ని సుసంపన్నం చేస్తున్నావు.+
దేవుని నుండి ప్రవహించే వాగు నీళ్లతో నిండివుంది,నువ్వు ప్రజలకు ధాన్యాన్ని ఇస్తావు,+నువ్వు భూమిని ఈ విధంగా సిద్ధం చేశావు.
10 నువ్వు దాని చాళ్లను తడిపి, దున్నిన నేలను చదును చేస్తావు;వర్షం చినుకులతో దాన్ని మెత్తపరుస్తావు; దాని మొలకల్ని దీవిస్తావు.+
11 నీ మంచితనంతో సంవత్సరాన్ని అలంకరిస్తావు;నీ దారులు సమృద్ధితో పొంగిపొర్లుతున్నాయి.+
12 ఎడారిలోని పచ్చికబయళ్లు తేమతో నిండిపోయాయి,+కొండలు ఆనందాన్ని వస్త్రంలా కప్పుకున్నాయి.+
13 పచ్చికబయళ్లలో ఎక్కడ చూసినా మందలే ఉన్నాయి,లోయల్లో పంట చేలు తివాచీలా పరుచుకున్నాయి.+
అవి సంతోషంతో కేకలు వేస్తున్నాయి, అవును పాటలు పాడుతున్నాయి.+
అధస్సూచీలు
^ అక్ష., “కప్పేస్తావు.”
^ లేదా “పవిత్రమైన స్థలంలోని.”
^ అక్ష., “ఆయన.”
^ అక్ష., “ఆయన.”
^ అక్ష., “ఆయన.”
^ అక్ష., “పొంగిపొర్లేలా.”