యెషయా 43:1-28
43 యెహోవా ఇలా అంటున్నాడు,యాకోబూ నీ సృష్టికర్త, ఇశ్రాయేలూ నిన్ను తయారుచేసిన దేవుడు ఇలా అంటున్నాడు:+
“భయపడకు, నేను నిన్ను తిరిగి కొన్నాను.+
పేరు పెట్టి నిన్ను పిలిచాను.
నువ్వు నాకు చెందినవాడివి.
2 నువ్వు జలాల గుండా వెళ్లేటప్పుడు, నేను నీకు తోడుగా ఉంటాను;+నువ్వు నదుల గుండా వెళ్లినప్పుడు, అవి నిన్ను ముంచెత్తవు.+
అగ్ని గుండా నడిచినప్పుడు నువ్వు కాలిపోవు,అగ్ని జ్వాల వల్ల కమిలిపోవు.
3 ఎందుకంటే నేను నీ దేవుడైన యెహోవాను,ఇశ్రాయేలు పవిత్ర దేవుణ్ణి, నీ రక్షకుణ్ణి.
నిన్ను విడిపించడానికి ఐగుప్తును మూల్యంగా చెల్లించాను,నీ కోసం ఇతియోపియాను, సెబాను చెల్లించాను.
4 ఎందుకంటే నువ్వు నా దృష్టిలో అమూల్యమైనవాడివి,+నేను నిన్ను ఘనపర్చాను, నేను నిన్ను ప్రేమించాను.+
కాబట్టి నీకు బదులుగా ప్రజల్ని,నీ ప్రాణానికి బదులుగా దేశాల్ని ఇస్తాను.
5 భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను.+
నీ సంతానాన్ని* తూర్పు నుండి తీసుకొస్తాను,పడమటి నుండి నిన్ను సమకూరుస్తాను.+
6 ఉత్తర దిక్కుతో, ‘వాళ్లను ఇచ్చేయి!’ అని చెప్తాను.+
దక్షిణ దిక్కుతో నేనిలా అంటాను: ‘వాళ్లను నీ దగ్గరే ఉంచుకోవద్దు.
దూరం నుండి నా కుమారుల్ని, భూమి కొనల నుండి నా కూతుళ్లను తీసుకురా;+
7 నా పేరుతో పిలవబడే ప్రతీ ఒక్కర్ని,+నా మహిమ కోసం నేను సృష్టించినవాళ్లను,నేను తయారుచేసి రూపించినవాళ్లను+ తీసుకురా.’
8 కళ్లు ఉండి కూడా గుడ్డివాళ్లలా ఉన్నవాళ్లను,చెవులు ఉండి కూడా చెవిటివాళ్లలా ఉన్నవాళ్లను+ తీసుకురండి.
9 దేశాలన్నీ ఒకచోట సమావేశమవ్వాలి,జనాలు సమకూడాలి.+
వాళ్లలో ఎవరు దీన్ని చెప్పగలరు?
లేదా మొదటి సంగతుల్ని* ఎవరు మాకు వినిపించగలరు?+
తాము నిర్దోషులమని రుజువు చేసుకోవడానికి వాళ్లు తమ సాక్షుల్ని ప్రవేశపెట్టాలి,లేదా విని, ‘ఇదే సత్యం!’ అని ఒప్పుకోవాలి.”+
10 “మీరే నా సాక్షులు”+ అని యెహోవా అంటున్నాడు,“అవును, నేను ఎంచుకున్న నా సేవకుడివి నువ్వు.+నువ్వు తెలుసుకొని, నా మీద విశ్వాసముంచి,*నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నానని+ అర్థం చేసుకునేలా నేను నిన్ను ఎంచుకున్నాను.
నాకన్నా ముందు ఏ దేవుడూ లేడు,నా తర్వాత కూడా ఏ దేవుడూ లేడు.+
11 నేను నేనే యెహోవాను,+ నేను తప్ప వేరే రక్షకుడు లేడు.”+
12 “మీ మధ్య ఏ అన్య దేవుడూ లేనప్పుడు+ప్రకటించింది నేనే, రక్షించింది నేనే, తెలియజేసింది నేనే.
కాబట్టి మీరే నా సాక్షులు” అని యెహోవా అంటున్నాడు, “నేనే దేవుణ్ణి.+
13 అంతేకాదు, నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను;+నా చేతిలో నుండి ఎవ్వరూ ఏదీ లాక్కోలేరు.+
నేను చర్య తీసుకున్నప్పుడు ఎవరు దాన్ని అడ్డుకోగలరు?”+
14 నీ విమోచకుడూ ఇశ్రాయేలు పవిత్ర దేవుడూ+ అయిన యెహోవా+ ఇలా అంటున్నాడు:
“మీ కోసం నేను వాళ్లను బబులోనుకు పంపించి, దాని ద్వారాల అడ్డగడియలన్నిటినీ విరగ్గొడతాను,+తమ ఓడల్లో ఉన్న కల్దీయులు ఆర్తనాదాలు పెడతారు.+
15 నేను యెహోవాను, నీ పవిత్ర దేవుణ్ణి,+ ఇశ్రాయేలు సృష్టికర్తను,+ నీ రాజును.”+
16 సముద్రం గుండా దారిని,అల్లకల్లోల జలాల మధ్య త్రోవను ఏర్పాటు చేసే+యెహోవా ఇలా అంటున్నాడు;
17 అవును, యుద్ధ రథాల్ని, గుర్రాల్ని,సైన్యాన్ని, బలమైన యోధుల్ని నడిపే దేవుడు+ ఇలా అంటున్నాడు:
“వాళ్లు పడుకొని తిరిగి లేవరు.+
వాళ్లు ఆర్పేయబడతారు, కాలుతున్న వత్తిలా ఊదేయబడతారు.”
18 “పాత సంగతుల్ని గుర్తుచేసుకోకండి,గతం గురించి అదేపనిగా ఆలోచించకండి.
19 ఇదిగో! నేనొక కొత్త పని చేయబోతున్నాను;+ఇప్పటికే అది మొదలైంది.
మీరు దాన్ని గుర్తించలేకపోతున్నారా?
నేను ఎడారి గుండా దారిని ఏర్పాటు చేస్తాను,+ఎడారి గుండా నదులు పారేలా చేస్తాను.+
20 అడవి జంతువులు నన్ను ఘనపరుస్తాయి,నక్కలు, నిప్పుకోళ్లు నన్ను గౌరవిస్తాయి;ఎందుకంటే నేను ఎంచుకున్న నా ప్రజలు+ తాగడానికిఎడారిలో నీళ్లను,ఎడారిలో నదుల్ని దయచేస్తాను.+
21 నా కీర్తిని చాటడానికినా కోసం నేను రూపొందించుకున్న ప్రజలు వాళ్లు.+
22 అయితే యాకోబూ నువ్వు నాకు ప్రార్థించలేదు,+ఎందుకంటే, ఇశ్రాయేలూ నువ్వు నా విషయంలో విసిగిపోయావు.+
23 నువ్వు సంపూర్ణ దహనబలులు అర్పించడానికి నా దగ్గరికి గొర్రెల్ని తేలేదు,నీ బలులతో నన్ను మహిమపర్చలేదు.
నాకు కానుక తెమ్మని నేను నిన్ను బలవంతం చేయలేదు,సాంబ్రాణి తీసుకురావాల్సిందే అంటూ నిన్ను విసిగించనూ లేదు.+
24 నీ డబ్బులతో నా కోసం సువాసన వెదజల్లే మొక్కను కొనలేదు,నీ బలుల కొవ్వుతో నన్ను తృప్తిపర్చలేదు.+
బదులుగా నీ పాపాల భారాన్ని నా మీద మోపావు,నీ దోషాలతో నన్ను విసిగించావు.+
25 నేను, అవును నేనే నా పేరు కోసం+ నీ దోషాల్ని* తుడిచేస్తున్నాను,+నీ పాపాల్ని నేను గుర్తుచేసుకోను.+
26 నువ్వు నాకు గుర్తుచేయి; మన మధ్య ఉన్న వివాదం గురించి మాట్లాడుకుందాం;నువ్వు నిర్దోషివని నిరూపించడానికి నీ వాదన వినిపించు.
27 నీ మొట్టమొదటి పూర్వీకుడు పాపం చేశాడు,నీ మధ్యవర్తులు* నా మీద తిరుగుబాటు చేశారు.+
28 కాబట్టి పవిత్ర స్థల అధిపతుల్ని నేను అపవిత్రపరుస్తాను,యాకోబును నాశనానికి అప్పగిస్తాను,ఇశ్రాయేలు గురించి ఎగతాళిగా మాట్లాడుకునేలా చేస్తాను.+
అధస్సూచీలు
^ అక్ష., “విత్తనాన్ని.”
^ భవిష్యత్తులో జరగబోయే మొదటి సంగతుల్ని సూచిస్తుండవచ్చు.
^ లేదా “నమ్మకముంచి.”
^ లేదా “తిరుగుబాట్లను.”
^ ధర్మశాస్త్ర బోధకుల్ని సూచిస్తుండవచ్చు.