యోబు 7:1-21

  • యోబు జవాబు కొనసాగుతుంది (1-21)

    • జీవితం బలవంతపు సేవ లాంటిది (1, 2)

    • “నన్నెందుకు గురిగా చేసుకున్నావు?” (20)

7  “భూమ్మీద మనిషి జీవితం బలవంతపు సేవ లాంటిది.అతని రోజులు కూలివాడి రోజుల లాంటివి.+   దాసునిలా అతను నీడ కోసం తపిస్తాడు,కూలివాడిలా తన జీతం కోసం ఎదురుచూస్తాడు.+   కొన్ని నెలలపాటు వ్యర్థమైన జీవితం నాకు నియమించబడింది,కష్టాలతో నిండిన రాత్రులు నాకోసం లెక్కించబడ్డాయి.+   నేను పడుకున్నప్పుడు, ‘ఎప్పుడు లేస్తానో?’ అని అనుకుంటాను,+ అయితే రాత్రి గడిచేకొద్దీ, తెల్లారే* వరకు నిద్రపట్టక అటూఇటూ దొర్లుతుంటాను.   నా ఒంటి నిండా పురుగులు, మట్టిపెళ్లలే ఉన్నాయి;+నా చర్మమంతా పక్కులతో నిండిపోయి చీము కారుతోంది.+   నా రోజులు నేతగాడి నాడె కన్నా త్వరగా గడిచిపోతున్నాయి,+ఎలాంటి ఆశాభావం లేకుండానే ముగిసిపోతున్నాయి.+   దేవా, నా జీవితం గాలి లాంటిదని,+నా కన్ను ఇంకెప్పుడూ సంతోషాన్ని* చూడదని గుర్తుచేసుకో.   ఇప్పుడు నన్ను చూసే కళ్లు ఇంకెప్పుడూ నన్ను చూడవు;నీ కళ్లు నా కోసం చూస్తాయి, కానీ నేను ఉండను.+   విడిపోయి కనుమరుగయ్యే మేఘంలాగే,సమాధిలోకి* వెళ్లే వ్యక్తి మళ్లీ పైకి రాడు.+ 10  అతను మళ్లీ తన ఇంటికి తిరిగెళ్లడు,అతని స్థలం ఇక అతన్ని గుర్తుపట్టదు.+ 11  అందుకే నేను మౌనంగా ఉండను. నా హృదయంలోని* వేదనను బట్టి మాట్లాడతాను;తీవ్రమైన మనోవేదనతో+ ఫిర్యాదు చేస్తాను. 12  నువ్వు నా మీద కాపలా ఉంచడానికినేను సముద్రాన్నా? భారీ సముద్రప్రాణినా? 13  నేను, ‘నా మంచం నన్ను ఓదారుస్తుంది;నా పరుపు నాకు ఉపశమనాన్ని ఇస్తుంది’ అని అనుకున్నప్పుడు 14  నువ్వు కలలతో నన్ను భయపెడతావు,దర్శనాలతో నన్ను బెదరగొడతావు, 15  ఇంతకన్నా ఊపిరాడక చావడమే నాకు మేలు,అవును, ఈ శరీరంతో బ్రతకడం కన్నా చావడమే నయం.+ 16  నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది;+ ఇక బ్రతకాలని లేదు. నన్నిలా వదిలేయి, ఎందుకంటే నా రోజులు ఊపిరిలాంటివి.+ 17  నువ్వు మనిషి గురించి ఇంతగా పట్టించుకోవడానికి,అతని మీద దృష్టి నిలపడానికి అతను ఏపాటివాడు?+ 18  నువ్వు ప్రతీ ఉదయం అతని మీద ఎందుకు దృష్టిపెడుతున్నావు?ప్రతీక్షణం అతన్ని ఎందుకు పరీక్షిస్తున్నావు?+ 19  నువ్వు నా మీద నుండి నీ దృష్టి పక్కకు తిప్పుకోవా?కనీసం గుటక వేసేంత సేపైనా నన్ను విడిచివెళ్లవా?+ 20  మనుషులు చేసే ప్రతీది గమనించే దేవా,+ ఒకవేళ నేను పాపం చేసినా, నీకెలా హాని చేయగలను? నన్నెందుకు గురిగా చేసుకున్నావు? నేను నీకు భారంగా తయారయ్యానా? 21  నువ్వు నా అపరాధాన్ని ఎందుకు మన్నించవు?నా తప్పును ఎందుకు క్షమించవు? త్వరలోనే నేను మట్టిలో నిద్రిస్తాను,+నువ్వు నాకోసం చూస్తావు, కానీ నేను ఉండను.”

అధస్సూచీలు

లేదా “వేకువ సంధ్య వెలుగు.”
అక్ష., “మంచిని.”
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.